అబుదాబిలో సూపర్యాచ్ల యజమానులకు కొత్త గోల్డెన్ వీసా పథకం..!!
- December 26, 2024
అబుదాబి: అబుదాబిలో సూపర్యాచ్ల యజమానులకు కొత్త గోల్డెన్ వీసా పథకాన్ని ప్రకటించారు. కొత్త పథకం ఇప్పుడు యూఏఈ రాజధాని నగరంలోని సూపర్యాచ్ యజమానులకు గోల్డెన్ వీసాను అందిస్తుంది. 'గోల్డెన్ క్వే' అబుదాబిలో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి రూపొందించారు.
అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ (ADIO), మిరల్ అనుబంధ సంస్థ యాస్ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా నిర్వహించబడుతున్న యాస్ మెరీనా సహకారంతో అబుదాబి (DCT అబుదాబి) డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది అర్హత కలిగిన యాచ్ యజమానులకు 10-సంవత్సరాల యూఏఈ గోల్డెన్ వీసాను అందిస్తుంది. ఇది దీర్ఘకాలిక రెసిడెన్సీని అనుమతిస్తుంది. గోల్డెన్ క్వే ద్వారా యాచ్ యజమానులు ఎమిరేట్ లో మెరుగైన పెట్టుబడి అవకాశాలకు పొందవచ్చు.
ఎవరు అర్హులు?
40 మీటర్లు మరియు అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఓడలు కలిగిన ప్రైవేట్ యాచ్ యజమానులు, అలాగే యాచింగ్ పరిశ్రమలోని ముఖ్య అధికారులు, సీఈఓలు, యాచ్-బిల్డింగ్ కంపెనీల ప్రధాన వాటాదారులు, సెంట్రల్ యాచ్ ఏజెంట్లు, యాచ్ సర్వీస్ ప్రొవైడర్లు, యాచ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు గోల్డెన్ వీసా కోసం అర్హులు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







