ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి..
- June 27, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మసీదును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
రంజాన్ మాసం సందర్భంగా అబు ఘరైబ్ మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి తనను తాను పేల్చుకునిఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడిలో 14 మంది మృతిచెందగా.. మరో 32 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







