'ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్'.
- June 27, 2016
ప్రతి సన్నివేశంలోనూ వినోదంతోపాటు సందేశాన్ని మేళవించి రూపొందించిన ఆలోచనాత్మక ప్రేమకథా చిత్రం 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్' అని పోల్కంపల్లి నరేందర్ అన్నారు. గోపీనాథ్ హీరోగా పరిచయం అవుతూ బీ.ఆర్.ఎస్.ఐ పతాకంపై దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్'. విష్ణు ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని పోల్కంపల్లి నరేందర్ నిర్మిస్తున్నారు. ఆర్.కె.స్టూడియోస్‌పై ఈచిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.. 'మా లవర్స్‌తోపాటు సినిమా లవర్స్ అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. 'గుంటూరు టాకీస్' వంటి హిట్ చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ బ్యానరైన ఆర్.కె. స్టూడియోస్ ద్వారా త్వరలోనే ఈ చిత్రం విడుదలవుతుండటం ఆనందంగా ఉంది' అని అన్నారు. 'సినిమా బాగా నచ్చి నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను' అని ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. 'ఈ చిత్రానికి సంగీతమందించే ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు' అని కనిష్క తెలిపారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







