జపాన్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి
- December 26, 2024
జపాన్: జపాన్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.గురువారం (26వ తేదీ) విమాన టికెట్ల విక్రయాలను కూడా విమానయాన సంస్థ నిలిపివేసింది. విమానయాన సంస్థ బ్యాగేజీ చెక్ ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తెలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ సైబర్ దాడి గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది.ఈ దాడిని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
దీని పై సోషల్ మీడియా వేదికగా జపాన్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని పేర్కొంది. గురువారం బయలుదేరే జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు టికెట్ల విక్రయాలు నిలిపివేయడం జరిగిందని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి జెఏఎల్ క్షమాపణలు చెప్పింది. కాగా, జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL)కు అల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ANI) తర్వాత దేశంలో రెండవ అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు ఉంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







