సిరియాలో పెరిగిన నిరసనలు, హోమ్స్‌లో కర్ఫ్యూ విధింపు

- December 26, 2024 , by Maagulf
సిరియాలో పెరిగిన నిరసనలు, హోమ్స్‌లో కర్ఫ్యూ విధింపు

సిరియా: డిసెంబర్ 25న, సిరియాలోని వివిధ ప్రాంతాలలో వేలాది మంది ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు సిరియాలో ఉద్రిక్తతలను పెంచిన విషయం. అలెప్పో నగరంలోని మైసలూన్ జిల్లాలోని అలవైట్ మందిరంపై దాడి చేయబడిన వీడియో ప్రసారం అయ్యింది. ఈ వీడియో చూపించడంతో దేశమంతటా నిరసనలు మరింత ముదిరాయి. కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ విధించడమే కాకుండా, ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిరియన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ వీడియో పాతదని, దానిని పరివర్తన దశలో ప్రజల మధ్య కలహాలు సృష్టించడానికి తిరిగి ప్రచురించారని చెప్పింది. ఈ వీడియో సిరియాలో రాజకీయ ఒత్తిడి ఉన్న సమయంలో వాస్తవం కాకుండా చూపించబడిందని సిరియా ప్రభుత్వం ఆరోపించింది. అయినప్పటికీ, తిరుగుబాటు ప్రభుత్వంలో ఉన్న నాయ‌కులు గుర్తు తెలియని గుంపు దాడికి పాల్పడినట్లు ఆరోపించారు.

సిరియాలో పశ్చిమ ప్రాంతంలో, హోమ్స్ మరియు వాయువ్య ప్రాంతం కర్దాహాలో నిరసనలు జరిగాయి. ఈ నిరసనల సమయంలో ఒకరు మరణించారని, మరొక ఐదుగురు గాయపడ్డారని నివేదికలు అందాయి. ఈ ఘటన తర్వాత, సిరియా అధికారులు 26 డిసెంబర్ వరకు హోమ్స్ నగరంలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు.ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, ప్రభుత్వ వర్గాలు శాంతిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

సిరియా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో, ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చినాయి. 2011లో ప్రారంభమైన సిరియా యుద్ధం ఇంకా ముగియలేదు, మరియు దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల మద్య ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com