కొత్త క్యాబిన్ బ్యాగేజీ నిబంధనలను విమానయాన సంస్థలు అమలు చేస్తాయా?
- December 28, 2024
యూఏఈ: భారతీయ విమానయాన సంస్థలు త్వరలో క్యాబిన్ బ్యాగేజీ నియమాలను ఖచ్చితంగా అమలు చేయడం ప్రారంభిస్తాయని, వాటిని కట్టుబడి ఉండాలని యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు తమ వినియోగదారులకు సలహా ఇస్తున్నారు. ఇండియాలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ క్యాబిన్ బ్యాగేజీని పరిమితం చేసిందని, అంతర్జాతీయ దేశీయ విమానాల కోసం 7 కిలోల కంటే ఎక్కువగా బ్యాగేజీ ఉండేలా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ అయిందన్నారు. విమానయాన సంస్థలు వీలైనంత త్వరగా ఈ నిబంధనలను అమలు చేయడానికి యోచిస్తున్నాయని స్మార్ట్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సఫీర్ మహమూద్ అన్నారు. దీనిని యూఏఈ నుండి ప్రయాణించే ప్రయాణీకులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
అయితే, సాఫ్రాన్ ట్రావెల్స్ అండ్ టూరిజం నుండి ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ.. ఈ విషయంలో అధికారిక సమాచారం అందలేదని, అయితే నిబంధనలను చాలా త్వరగా అమలు అవుతాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, సర్క్యులర్ జారీ చేయకముందే చాలా విమానయాన సంస్థలు ఈ నిబంధనలను అమలు చేస్తున్నందున ఇది ప్రయాణికులపై తక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులందరూ అభిప్రాయపడ్డారు. ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు, బ్యాక్‌ప్యాక్‌లు, ప్లాస్టిక్ బ్యాగ్‌లలో వస్తువులను తీసుకెళ్లే అలవాటు ఉన్నవారు కొత్త నిబంధనలతో ప్రభావితం అవుతారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







