దుబాయ్ లో స్నేహితుడిని చంపిన ఆస్టేలియన్ వ్యక్తికి జీవిత ఖైదు..!!
- December 28, 2024
యూఏఈ: దుబాయ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన స్నేహితుడిని కత్తితో పొడిచి చంపి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఆస్ట్రేలియా వ్యక్తికి దుబాయ్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. నేరస్తుడు జుమేరా బీచ్ రెసిడెన్స్ భవనంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 26, 2022 న వ్యక్తిగత వివాదంలో అతని స్నేహితుడిపై దాడి చేశాడు. సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి ప్రారంభమైన గొడవ, హింసకు దారితీసిందని కోర్టు పేర్కొంది. మృతదేహాన్ని మరుసటి రోజు (అక్టోబర్ 27)దాడి చేసిన వ్యక్తి స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు ఆస్ట్రేలియాకు పారిపోతుండగా షార్జాలోని ఓ హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించింది. డిసెంబర్ 23న జారీ అయిన ఈ తీర్పును 14 రోజుల్లోపు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. యూఏఈలో జైలు జీవితం సాధారణంగా 25 సంవత్సరాలు ఉంటుందని న్యాయ రంగ నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







