మౌంటైన్ హైకింగ్ ఈవెంట్.. వాడి బని ఖలీద్లో ప్రారంభం..!!
- December 28, 2024
మస్కట్: ఒమన్లోని నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఉన్న వాడి బానీ ఖలీద్లో హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మౌంటైన్ హైకింగ్ ఈవెంట్ ప్రారంభమైంది. రెండు రోజుల ఈవెంట్కు వివిధ గవర్నరేట్లు, ప్రాంతాల నుండి 150 మందికి పైగా హైకర్లు తరలివచ్చారు. వాడి బనీ ఖలీద్లోని సుందరమైన నీటి కొలనుల వద్ద మొదటి రోజు హైకింగ్ ప్రారంభమైంది.పర్వత హైకర్స్ అల్ సహ్ఫ్, అల్ సఫా, అల్ మేసెమ్, హేల్ అల్ నఖాతో సహా అనేక గ్రామాల గుండా ప్రయాణించారు. 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్ర మట్టానికి 2,050 మీటర్ల ఎత్తున ఉన్న హ్లూట్ గ్రామంలో తొలిరోజు ప్రయాణం ముగిసింది.
రెండవ రోజు హైకర్లు హ్లూట్ గ్రామం నుండి బయలుదేరి, 11 కిలోమీటర్ల హైకింగ్ ను ప్రారంభించారు. ఈ మార్గం వారిని దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సూర్లో ఉన్న టివి టౌన్షిప్లోని సీమా గ్రామానికి చేరుకుంటారు. ఈవెంట్ చివరి దశ 9 కిలోమీటర్ల మేర టివి బ్రిడ్జి కింద ముగుస్తుంది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







