7 కొత్త సెల్ఫ్ సర్వీస్ మెషీన్లను ప్రారంభించిన ఆర్టిఎ
- June 28, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, కొత్తగా మరో ఏడు సెల్ఫ్ సర్వీస్ మెషీన్లను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న 10 మెషీన్లకు ఇవి అదనం. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, సీజనల్ పార్కింగ్ పర్మిట్, అలాగే వాహన రిజిస్ట్రేషన్లను ఈ మెషీన్ల ద్వారా నిర్వహించుకోవచ్చు. 2013లో ఫెతాటి బ్రాండ్‌తో ఏర్పాటైన ఈ మెషీన్ల ద్వారా 60,869 ట్రాన్సాక్షన్స్ పూర్తయ్యాయి. ఆర్టిఎ కస్టమర్ సర్వీసెస్ డైరెక్టర్ అహ్మద్ మహబూబ్ మాట్లాడుతూ, నఫెతాటి ద్వారా సర్వీసులను మరింత మెరుగ్గా అందించాలనుకుంటున్నామనీ, మెషీన్ల వద్దకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుండడంతో, వినియోగదారుల సౌకర్యార్థం కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉమ్ అల్ రొమూల్, జెబిర్, అల్ మనార్, తస్జీల్ అల్ మర్షా, క్విక్ అల్ కుసైస్, అమ్మాన్ స్ట్రీట్, ఇండస్ట్రియల్ ఏరియా 3, తస్జీల్ అల్ కాసిస్, అల్ కరామా మరియు అల్ తవార్ సెంటర్ వంటి చోట్ల ఏర్పాటు చేసిన ఈ మెషీన్లు ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







