ఒమన్ లో కొత్త విద్యుత్ టారిఫ్ నిబంధనలు.. కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్లు..!!

- December 30, 2024 , by Maagulf
ఒమన్ లో కొత్త విద్యుత్ టారిఫ్ నిబంధనలు.. కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్లు..!!

మస్కట్: అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ (APSR) కొత్త కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్ రెగ్యులేషన్ అమలును ప్రకటించింది. ముఖ్య నిబంధనలలో ఇవి ఉన్నాయి.
ఆర్టికల్ 1
ఏటా 100 మెగావాట్ల గంటల కంటే ఎక్కువ వినియోగించే నాన్-రెసిడెన్షియల్ ఎలక్ట్రిసిటీ సబ్స్క్రైబర్లకు కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్లను వర్తింపజేయడాన్ని కొత్త నిబంధన తప్పనిసరి చేసింది. సబ్స్క్రైబర్లు లోడ్ ఆధారంగా మూడు టారిఫ్ లలో ఒకదానిని ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు.  
ఆర్టికల్ 2
టారిఫ్ , విద్యుత్ సరఫరా ఖర్చు, ట్రాన్స్ మిషన్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, ట్రాన్సిమిషన్ కాస్ట్ ఆధారంగా కొత్త టారిఫ్ లను ఎంచుకోవచ్చు. APSR వివిధ యూజర్స్ వర్గాలకు నిర్దిష్ట రేట్లను ఫిక్స్ చేసింది.  డిసెంబర్ చివరి నాటికి రాబోయే సంవత్సరానికి టారిఫ్ లను ప్రకటిస్తుంది.  
ఆర్టికల్ 3
క్యాబినెట్ ఆమోదానికి లోబడి నిర్దిష్ట నాన్-రెసిడెన్షియల్ కేటగిరీలకు ప్రామాణిక టారిఫ్ నిర్మాణానికి మినహాయింపులు ప్రకటించారు.
ఆర్టికల్ 4
ఏటా డిసెంబర్ చివరి నాటికి APSR తదుపరి సంవత్సరానికి ట్యాక్సుల లెక్కలను వెల్లడిస్తుంది. ఇందులో ఒమన్ పవర్ అండ్ వాటర్ ప్రొక్యూర్మెంట్ కంపెనీ, ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ, ఇతర లైసెన్స్ పొందిన విద్యుత్ డిస్ట్రిబ్యూటర్లు, సరఫరాదారుల ఖర్చులను వేర్వేరుగా వెల్లడిస్తారు. APSR వెబ్సైట్ లేదా ఇతర సంబంధిత ప్లాట్ఫారమ్లలో వీటి సమాచారాన్ని ప్రకటిస్తారు.
ఆర్టికల్ 5
టారిఫ్ దరఖాస్తు ప్రక్రియను స్పష్టం వెల్లడించారు. అమలును నిర్ధారించడానికి మార్గదర్శకాలను జారీ చేసే హక్కు APSRకి ఉంటుంది. ఇవి APSR వెబ్సైట్లో లేదా ఇతర అధికారిక ఛానెల్ల ద్వారా కూడా వెల్లడిస్తారు.  ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com