తెలంగాణ నేతల లేఖలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయం
- December 30, 2024
అమరావతి: తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.దీంతో ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు చిక్కులు తొలగినట్లే. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ నుంచి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపే సిఫార్సు లేఖల ఆధారంగా తిరుమలలో శ్రీవారి దర్శనం కేటాయింపుల్లో ఈ మధ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తెలంగాణకు చెందిన అధికార, విపక్ష పార్టీలు కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నాయి. తొలుత ఈ విషయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విమర్శలపై టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా స్పందించారు. తిరుమలలో వివక్ష పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు రావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
వారానికి 4 సిఫార్సు లేఖలకు అంగీకారం
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు.ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి 4 సిఫార్సు లేఖలను అంగీకరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఇందులో వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు మరో రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







