న్యూఇయర్ ముందు హౌజింగ్ కోసం నివాసితుల కష్టాలు..!!
- December 31, 2024
దుబాయ్: ఆదివారం రాత్రి దుబాయ్‌లోని మాల్ ఆఫ్ ఎమిరేట్స్ సమీపంలోని రెసిడెన్సీ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో అనేకమంది రెంటర్స్ ఇప్పుడు తాత్కాలిక వసతి కోసం వెతుకుతున్నారు. కొందరు స్నేహితులు లేదా బంధువుల ఇండ్లలో ఆశ్రయం పొందుతుండగా, మరికొందరు హోటల్ గదులను బుక్ చేసుకుంటున్నారు.
ఆయిషా, మరియం అనే ఇద్దరు స్నేహితులు భవనాన్ని అధికారులు ఖాళీ చేయించడంతో ఇప్పుడు వారు రోడ్డుపై నిల్చున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఇద్దరు నివాసితులు తమ వస్తువులలో కొన్నింటిని తీసుకొని ఉండేందుకు రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన వస్తువులను పొందడానికి ప్రయత్నించానని, కాని పోలీసులు అడ్డుకున్నారని నాల్గవ అంతస్తులో నివసించే ఫిలిప్పీన్స్ చెఫ్ క్రిస్టియన్ అకోస్టా తెలిపారు. అయినా, ఆశ్రయం కోల్పోయిన వారికి ఆహారం అందిస్తూ తన వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. తాత్కాలికంగా తన స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపాడు. కొత్త సంవత్సరం రావడంతో, అద్దెలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని రాహి అనే భారతీయ నివాసి తెలిపారు. అధికారులు తమ పరిశోధనలను త్వరగా ముగించాలని, తమ గృహ సమస్యకు సత్వర పరిష్కారం కోసం నివాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









