బహ్రెయిన్ లో 50శాతం పెరిగిన ఫ్లవర్ డిమాండ్..!!
- December 31, 2024
మనామా: బహ్రెయిన్ జాతీయ సెలవులు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఫ్లవర్ డిమాండ్‌ను 50% పెంచాయని ఒక దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న ప్రముఖ ఫ్లోరిస్ట్ హసన్ అబ్దుల్లా అల్ మధూబ్ తెలిపారు. డిసెంబరు 15 నుండి పువ్వుల అమ్మకాలలో భారీ పెరుగుదల నమోదు అయినట్లు పేర్కొన్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 40% తగ్గిందని చెప్పారు. రెండ్, వైట్ గులాబీలు బహ్రెయిన్ జాతీయ జెండా రంగులను సూచిస్తాయి. ప్రేమ, ఆప్యాయతలను సూచిస్తాయి. ఈ రంగులు బహ్రెయిన్‌లో లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వేడుకల సమయంలో వీటికి అధిక డిమాండ్ ఉంటుందన్నారు. అలాగే, ప్రత్యేకమైన బహుమతులు, ప్రత్యేకంగా రూపొందించిన లగ్జరీ ఫ్లవర్ ఏర్పాట్లతో కూడా ఫ్లవర్స్ కు డిమాండ్ ఉంటుందన్నారు. కోవిడ్ అనంతరం ఆన్లైన్ ఆర్డరింగ్, డెలివరీలకు బాగా ప్రాచుర్యం వచ్చిందన్నారు. ఇంట్లో ఉండే నేరుగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫ్లవర్స్ డెలివరీ చేయడానికి వీలు ఉండటంతో ఈ ట్రెండ్ కు డిమాండ్ పెరుగుతుందని మధూబ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









