సౌదీ అరేబియాలో 28,806 ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్ వాహనాలు రీకాల్..!!

- January 02, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో 28,806 ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్ వాహనాలు రీకాల్..!!

రియాద్: సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ 28,806 ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్ వాహనాలను ( 2011 - 2019 మోడల్స్)  రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. విండ్‌షీల్డ్ సపోర్ట్‌ల అవుట్ సైడ్ కవర్‌ల ఇన్‌స్టాలేషన్‌లో లోపం కారణంగా రికాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ లోపం వాహనదారులకు ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు తెలిపారు. అవసరమైన మరమ్మతులను ఉచితంగా నిర్వహిస్తామని తెలిపింది. అల్ జజీరా వెహికల్స్ ఏజెన్సీస్ కంపెనీ, టోల్-ఫ్రీ నంబర్ (8007492222), మహ్మద్ యూసుఫ్ నఘి కంపెనీ, టోల్-ఫ్రీ నంబర్ (8001240218)లో సంప్రదించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.  రీకాల్ వాహన ఛాసిస్ నంబర్‌లను డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ రీకాల్ సెంటర్ (http://Recalls.sa) వెబ్‌సైట్‌ లో నమోదు చేశామని, అక్కడి నుండి వివరాలను తెలుసుకోవాలని సూచించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com