ఆస్ట్రేలియా పేరెంట్ వీసాకు మరింత సమయం
- January 02, 2025
ఆస్ట్రేలియా: గత కొన్నిసంవత్సరాల నుంచి విదేశీ విద్యకు, ఉపాధికి డిమాండ్ పెరిగింది. మన దేశం నుంచి ఏటా ఈ సంఖ్య పెరిగిపోతున్నది. దీనితో వీసా లను పొందేందుకు కష్టంగా మారింది. తాజాగా ఆస్ట్రేలియా జనరల్ పేరెంట్ వీసా కోసం 31 ఏండ్లు, కాంట్రిబ్యూటరీ పేరెంట్ వీసా కోసం 14 ఏండ్లు నిరీక్షించాల్సి ఉందని తాజా నివేదిక తెలియజేసింది. దీంతో ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో గత మూడేండ్లలో 2300 మంది మరణించినట్టు ఆస్ట్రేలియా హోం శాఖ తెలిపింది.
పేరెంట్ వీసాలకు పెరిగిన డిమాండ్
ఆస్ట్రేలియా పేరెంట్ వీసాలకు డిమాండ్ బాగా పెరగడంతో దీని సంఖ్యను ఏడాదికి 4500 నుంచి 8500కు పెంచారు. అయితే ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. వీటి కోసం వచ్చే దరఖాస్తులు మాత్రం అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. 2023లో వీటి దరఖాస్తులు 1.5 లక్షలకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా పేరెంట్ వీసాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. దీనితో పాటు దాని నిరీక్షణ సమయం కూడా అనూహ్యంగా పెరిగిపోయింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









