మహా కుంభమేళాలో బాంబు బెదిరింపులు

- January 02, 2025 , by Maagulf
మహా కుంభమేళాలో బాంబు బెదిరింపులు

ప్రయాగరాజ్: త్వరలో ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు తరలి వచ్చేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్‌ ముస్తాబవుతోంది.మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.అయితే, ఈ కుంభమేళాకు బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓ ఎక్స్‌ యూజర్‌ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. మతపరమైన ఈ కార్యక్రమానికి హాజరయ్యే కనీసం 1,000 మందిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన యూపీ పోలీసులు సదరు ఎక్స్‌ యూజర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.

45 రోజుల పాటు ఉత్సవాలు
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళాలో 45 కోట్లమంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరిచేం అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో పాల్గొనే భక్తుల సౌకర్యం కోసం 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తారు. 1,250 కిలోమీటర్ల పైప్‌లైనును సిద్ధం చేస్తున్నారు. 67 వేల ఎల్‌ఈడీ లైట్లు, 2 వేల సోలార్‌ లైట్లు, 3 లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలు, ఆర్‌ఎఫ్‌ఐడీ రిస్ట్‌బ్యాండ్స్‌, యాప్‌ ట్రాకింగ్‌లతో భక్తులను లెక్కిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com