ఫ్రీ WIFI సేవలు అందించే తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా
- January 02, 2025
న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో ఉచిత వైఫై సేవలు అందించడం ద్వారా చరిత్ర సృష్టించింది. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా, దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9, మరియు సెలెక్ట్ ఎయిర్ బస్ ఏ321 నియో విమానాల్లో అందుబాటులో ఉంటాయి.
విమాన ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలు విమానం 10 వేల అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు ఒకేసారి పలు పరికరాలను వైఫైకి కనెక్ట్ చేసి, నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియాలో చాటింగ్, మరియు టెక్ట్స్ మెసేజ్‌లు పంపడం వంటి పనులు చేయవచ్చు.
ఇంట్రడ్యూసరీ పీరియడ్‌లో భాగంగా, దేశీయ సర్వీసుల్లో ఈ వైఫై సేవలు కాంప్లిమెంటరీగా అందిస్తారు.ఈ నిర్ణయం ద్వారా ఎయిర్ ఇండియా, దేశీయ విమానాల్లో ఇన్-ఫ్లైట్ వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా నిలిచింది. గతంలో, విస్తారా ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ రూట్లలో వైఫై సేవలు అందించగా, ఇప్పుడు ఎయిర్ ఇండియా దేశీయ రూట్లలో కూడా ఈ సేవలను ప్రారంభించింది.
ఈ సేవలు అందుబాటులోకి రావడంతో, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా అనుభవించగలరు.ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం, విమాన ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







