క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న శివరాజ్ కుమార్
- January 02, 2025
అమెరికా: క్యాన్సర్ వ్యాధి నుంచి ప్రముఖ కన్నడ సినీ హీరో శివరాజ్ కుమార్ కోలుకుంటున్నారు.శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానులకు ఆయన శుభవార్త తెలిపారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. చికిత్స చివరి దశకు చేరుకుందని… త్వరలోనే మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ తెలిపారు. క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరైనా భయపడతారని… అయితే, ఆ భయం నుంచి బయటపడేందుకు తన భార్య గీత, తన అభిమానులు ఎంతో సహకరించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.పూర్తి చేయాల్సిన సినిమాల కోసం తాను ఎంతో కష్టపడ్డానని… కీమో థెరపీ చేయించుకుంటూనే ’45’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశానని తెలిపారు. వైద్యులు కూడా ఎంతో సహకరించారని చెప్పారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







