ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ ప్రాజెక్టుపై చర్చించిన కువైట్ కేబినెట్..!!

- January 02, 2025 , by Maagulf
ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ ప్రాజెక్టుపై చర్చించిన కువైట్ కేబినెట్..!!

కువైట్: బయాన్ ప్యాలెస్‌లో ప్రధాన మంత్రి అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రణాళికా దశలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ ప్రాజెక్ట్ స్థితిపై చర్చించారు. పునరుద్ధరణ పనుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని 2016లో మూసివేశారు. ప్రాజెక్ట్ స్థలాన్ని 2.65 మిలియన్ చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. జూలై 2024లో, మునిసిపల్ కౌన్సిల్ ప్రాజెక్ట్ పర్యవేక్షణను కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి బదిలీ చేశారు. 

అంతకుముందు, ఒక అధ్యయనం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు KD 200 మిలియన్లుగా అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి GDPకి KD 85 మిలియన్లను అందించాలని, 2030 నాటికి 900,000 మంది సందర్శకులతో 4,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. కువైట్ విస్తృత అభివృద్ధి, పెట్టుబడులు,పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని క్యాబినెట్ కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com