పొట్లకాయ పల్లీ పొడి కూర
- June 28, 2016
పొట్లకాయ పల్లీ పొడి కూర
కావాల్సిన పదార్థాలు
పొట్లకాయ - ఒకటి,
ఉల్లిపాయ తరుగు-అరకప్పు,
ఆవాలు,జీలకర్ర, మినపప్పు, శనగపప్పు-అర టీ స్పూను చొప్పున,
ఉప్పు-తగినంత,
నూనె-ఒక టేబుల్ స్పూను,
ఎండు మిర్చి-ఆరు,
వెల్లుల్లి రేకలు-ఆరు,
వేరుశెనగపప్పులు- అరకప్పు,
కరివేపాకు-నాలుగు రెబ్బలు,
పసుపు-అర టీ స్పూను,
ఇంగువ- చిటికెడు,
కొత్తిమీర తరుగు-అరకప్పు
తయారీ
పొట్లకాయని ముక్కలుగా తరిగి చిటికెడు పసుపు కలిపి, కప్పు నీటితో ఉడికించాలి.( ముక్క సగం ఉడికితే చాలు) ఎండుమిర్చి, వేరుశనగపప్పులను విడివిడిగా వేగించి వెల్లుల్లితో కలిపి పొడి చేయాలి. నూనెలో తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉల్లితరుగు వేగించి ఉడికిన ముక్కలు కలపాలి. ఐదు నిమిషాలు మగ్గించి ఉప్పు, వేరుశనగ పొడి మిశ్రమం కలపి మరో రెండు నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









