వార్థక్యపు ఛాయలు కనిపించకుండా చేయాలంటే....
- June 28, 2016
వార్థక్యపు ఛాయలు కనిపించకుండా చేయాలంటే.. ఒక్క సౌందర్య సాధనాలపైనే ఆధారపడితే చాలదు. మీ రోజువారి జీవితంలో చిన్నపాటి మార్పులూ చేసుకోవాలి. ఎలాగంటే..
మంచినీళ్లు: శరీరానికి సరిపడా నీళ్లు తాగితే చాలినంత తేమ అందుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయివి. కాబట్టి దాహంతో సంబంధంలేకుండా నీళ్లు తరచూ తాగేలా చూసుకోవాలి.
మేకప్: సహజ అందాన్ని మెరిపించేందుకు మేకప్ తప్పనిసరే. అలాగని అతిగా వాడకూడదు. నిద్రపోయేముందు ముఖానికి వేసుకున్న మేకప్ తప్పనిసరిగా తీసేయాలి. దాంతో మేకప్‌కి దుమ్మూ, ధూళీ అతుక్కుపోయి చర్మగ్రంథులు పెద్దవి అవుతాయి.
ఎండ నుంచి రక్షణ: ఎండ వల్ల చర్మం సాగినట్లు అవుతుంది. చిన్నవయసులోనే ముడతలు మొదలవుతాయి. అందుకే బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. చలువ కళ్లద్దాలూ, టోపీ, స్కార్ఫ్లాంటివీ ఉపయోగించాలి.
వ్యాయామం: మీరెంత దృఢంగా ఉంటే అంత యౌవనంగా కనిపిస్తారు. కాబట్టి పోషకాహారం తీసుకుంటూ, రోజులో అరగంటైనా వ్యాయామం చేయండి.
నిద్ర: కంటినిండా నిద్రలేకపోయినా కళ్లు నిర్జీవంగా మారతాయి. నల్లని వలయాలూ వచ్చేస్తాయి. చర్మానికీ సరిపడా విశ్రాంతి లేక.. వార్థక్యపు ఛాయలు ముంచుకొస్తాయి. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. అప్పుడే తాజాగా కనిపిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







