ఎయిర్ ఇండియా 'సూపర్ సేవర్' పథకం
- June 28, 2016
రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రమే వర్తింపు ఎయిర్ ఇండియా 'సూపర్ సేవర్' పథకం రైల్వే టికెట్ ఖరారుకాని ప్రయాణికులకు శుభవార్త. రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ మొదటి తరగతి టికెట్ ఖరారుకాని ప్రయాణికులు.. ఇకపై ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించవచ్చు. ఈ మేరకు కొంత కాలపరిమితి వరకు ప్రత్యేక పథకాన్ని విమానయాన సంస్థ ప్రారంభించనుంది. నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్టు)లో ఉన్న ప్రయాణికులు విమానం ప్రారంభానికి నాలుగు గంటలముందు టికెట్ తీసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో మంగళవారం తెలిపింది. 'సూపర్ సేవర్' అనే ఈ పథకాన్ని జూన్ 26 నుంచి సెప్టెంబరు 30 వరకు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రోజూ 20 వేల మంది ప్రయాణిస్తున్నారు. ముంబయి, చెన్నై, కోల్‌కతా, గువాహాటి రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మొదటి తరగతి ఏసీ టికెట్ ధర వరుసగా రూ.4755, 6335, 4815, 5990 వసూలు చేస్తున్నారు. 'సీట్ల కొరత కారణంగా చాలామందికి టికెట్లు ఖరారు కావడం లేదు. ఈ లోటును ఎయిర్ ఇండియా భర్తీ చేస్తుంది' అని విమానయాన సంస్థ స్పష్టం చేసింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే ముందే గమ్యాన్ని చేరుకోగలరని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







