సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం సెకండ్ ఫేజ్..రెస్టారెంట్ల ధరలపై ప్రభావం ఎంత?
- January 04, 2025
యూఏఈ: దుబాయ్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం రెండో దశ ప్రారంభమైంది. జనవరి 1నుంచి రెస్టారెంట్‌లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి వచ్చింది. కాగా, ఇది రెస్టారెంట్ల ధరలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. దుబాయ్‌లో సింగిల్ యూజ్ ఐటమ్‌లను పూర్తిగా నిషేధించే జూన్ 1 నాటికి పూర్తి కానుంది. "మున్సిపాలిటీ నుండి స్పష్టమైన ఆదేశాలు ఇంకా అందలేదు. తాము స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాము. అయితే ఈలోగా మేము నిబంధనల మేరకు మార్పులు చేయడం ప్రారంభించాము. కాగితంతో తయారు చేయబడిన టేబుల్ కవర్లు ప్లాస్టిక్ వాటి కంటే రెట్టింపు ఖర్చవుతాయి. ఇది కస్టమర్లపై స్పల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది." అని జామ్ జామ్ మండి గ్రూప్ రెస్టారెంట్ల యజమాని షైజిల్ హుస్సేన్ అన్నారు. నిషేధం రెండవ దశలో భాగంగా స్టైరోఫోమ్ ఫుడ్ కంటైనర్లతో పాటు ప్లాస్టిక్ స్ట్రాస్, స్టిరర్లు, టేబుల్ కవర్ల స్థానంలో వెదురు టేబుల్ కవర్లు, చెక్క స్పూన్లు ప్రత్యామ్నాయ జాబితాను దుబాయ్ మునిసిపాలిటీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. అయితే, డ్రింక్ ప్యాకేజీలతో ప్యాక్ చేయబడిన ప్లాస్టిక్ స్ట్రాలు, ప్యాక్ చేయబడిన మాంసం ఉత్పత్తులు, వైద్య పరికరాల కోసం స్టైరోఫోమ్ ట్రేల వినియోగంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయని హాట్‌ప్యాక్ గ్లోబల్‌లో గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ & హెడ్ ఆఫ్ సస్టైనబిలిటీ డాక్టర్ మైక్ చీతం అన్నారు. "మా వద్ద కాగితం, బోర్డ్, ప్లాంట్, బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్రత్యామ్నాయాలు వంటి అనేక రకాల పర్యావరణ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి." అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







