కేశినేని నాని క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదు-- వంగవీటి రాధా
- June 28, 2016
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో విజయవాడలో జన జీవనాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.
నగరంలో రోడ్ల విస్తరణ పేరిట ఇటీవల అధికారులు పలు పురాతన ఆలయాలను తొలగించారు. అంతేగాక, అధికారులను అడ్డుకున్న గోశాల నిర్వాహకులపై ఎంపీ హోదాలో ఉన్న నాని దుర్భాషలాడారనే ఆరోపణలు వచ్చాయి. 'అభివృద్ధిని అడ్డుకుంటారా?... ఎవడ్రా వీడు.. వీరి ఓట్లు మనకవసం లేదు' అని నాని దుర్భాషలాడినట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, హిందూ పరిరక్షణ సమితిలు నాని వైఖరికి నిరసనగా బుధవారం బెజవాడ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా మంగళవారం వంగవీటి రాధ మాట్లాడుతూ.. నాని క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







