ఇంట్రస్టింగ్ టైటిల్ తో మహేష్ మూవీ..
- June 28, 2016
బ్రహ్మోత్సవం రిజల్ట్ తో షాక్ తిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. మురుగదాస్ మార్క్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే కథ కథానాలు రెడీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ముందుగా ఈ సినిమాకు టైటిల్ గా 'ఎనిమీ', 'చట్టంతో పోరాటం' అనే పేర్లు వినిపించాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఆలోచిస్తున్నారట చిత్రయూనిట్. గతంలో కథకు సంబందం లేకపోయినా గజిని టైటిల్ తో సినిమాను తెరకెక్కించిన మురుగదాస్ మంచి విజయం సాధించాడు. అదే తరహాలో మహేష్ సినిమాకు 'వాస్కోడాగామ' అనే టైటిల్ ను పెట్టాలని భావిస్తున్నాడట. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా దర్శకుడు మాత్రం ఇదే టైటిల్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు పుణె, రాజస్థాన్, ముంబైలలో చిత్రీకరించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







