దుబాయ్ లో భార్యపై దాడి.. వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- January 05, 2025
దుబాయ్: దుబాయ్‌లో భార్యపై దాడి చేసినందుకు ఒక వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, తర్వాత బహిష్కరణ విధించబడింది. ఈ దాడిలో ఆమె చేయి విరిగి మూడు శాతం శాశ్వత వైకల్యానికి గురైంది. ఈ సంఘటన జూలై 1, 2023న జరిగింది. ఆసియన్ జాతీయతకు చెందిన దంపతులు ఇద్దరూ షేక్ జాయెద్ రోడ్డు మీదుగా వెళ్తుండగా, కారు లోపల వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెరగడంతో భర్త తన భార్యపై దాడి చేశు. బాధితురాలు జులై 5, 2023న తన భర్త తనపై ఎలా దాడి చేశాడో వివరిస్తూ బర్ దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్టోబర్, నవంబర్లలో నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షలు ఆమె వాదనలకు మద్దతుగా నిలిచాయి. ప్రతివాది తీర్పుపై అప్పీల్ చేసారు. అప్పీల్ కోర్టులో మొదటి విచారణ జనవరి 13న జరుగుతుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







