విశాఖ సెంట్రల్ జైల్లో హోంమంత్రి అనిత తనిఖీలు.. జైల్లో షాక్ ఇచ్చిన ఆ మొక్క

- January 05, 2025 , by Maagulf
విశాఖ సెంట్రల్ జైల్లో హోంమంత్రి అనిత తనిఖీలు.. జైల్లో షాక్ ఇచ్చిన ఆ మొక్క

విశాఖ సెంట్రల్ జైలుకి వెళ్లిన హోంమంత్రి అనిత ఒక్కసారిగా అవాక్కయ్యారు. జైల్లో అడుగు పెట్టగానే హోంమంత్రి అనితకు ఏకంగా గంజాయి మొక్క స్వాగతం పలికింది. గంజాయి మొక్కను చూసి హోంమంత్రి కంగుతిన్నారు. ఇక్కడికి గంజాయి మొక్క ఎలా వచ్చిందని జైలు అధికారులను గట్టిగా నిలదీశారు.

విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలు వస్తుండటంతో స్వయంగా హోంమంత్రి రంగంలోకి దిగారు. జైల్లో తనిఖీలు చేశారు. జైల్లో తిరుగుతున్న సమయంలో హోంమంత్రి అనితకు ఒక గంజాయి మొక్క కనిపించింది. విశాఖ జైల్లో గంజాయి సరఫరా జరుగుతోందనే ప్రచారానికి ఈ గంజాయి మొక్క ఇప్పుడు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. జైల్లో గంజాయి సరఫరాపై విచారణ జరుగుతోందన్నారు హోంమంత్రి అనిత.

గంజాయి సప్లయ్ వెనక జైలు సిబ్బంది ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జైల్లో జరుగుతున్న ఘటనలపై కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే జైల్లో ఏళ్లకు ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కూడా బదిలీ చేస్తామన్నారు. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్ కనిపించడంపై కూడా హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. ఏ ఖైదీ సెల్ ఫోన్ వినియోగించాడు, ఎవరికి ఫోన్ చేశారు అనేదానిపై ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. ఎవరికైతే ఫోన్ చేశారో అవతలి వ్యక్తి కూడా కోర్టుకు రాక తప్పదన్నారు హోంమంత్రి అనిత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com