పార్వ‌తీదేవీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. క‌న్న‌ప్ప పోస్ట‌ర్ విడుద‌ల‌..

- January 06, 2025 , by Maagulf
పార్వ‌తీదేవీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. క‌న్న‌ప్ప పోస్ట‌ర్ విడుద‌ల‌..

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ తెర‌కెక్కుతోంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ముఖేష్‌కుమార్‌ సింగ్ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో మంచు ఫ్యామిలీ మొత్తం న‌టిస్తోంది. అలాగే ప్రభాస్, మధుబాల, కాజ‌ల్‌, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది.

అందులో భాగంగా ఒక్కొక్క‌రి లుక్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. మంచు విష్ణు, మోహ‌న్ బాబు, విష్ణు కుమారుడు అవ్రామ్‌, కుమారైలు అరియానా, వివియానాల‌తో పాటు ప‌లువురిని ఫ‌స్ట్ లుక్స్‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా నేడు కాజ‌ల్ అగ‌ర్వాల్ కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు.

ముల్లోకాలు ఏలే తల్లి! భ‌కుల్ని ఆదుకునే త్రిశ‌క్తి! శ్రీకాళ హ‌స్తిలో వెల‌సిన శ్రీ జ్ఞాన ప్ర‌సూనాంబిక‌! అని ఆ పోస్ట‌ర్ పై రాసి ఉంది. మొత్తంగా ఆమె లుక్ అదిరిపోయింది. క‌ల నిజ‌మైంది అంటూ కాజ‌ల్ ఈ పోస్ట‌ర్‌ను షేర్ చేస్తూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com