బహ్రెయిన్ లో ఫుట్‌బాల్ ‘హీరోస్’కు ఘన స్వాగతం..!!
- January 06, 2025
మనామా: 26వ అరేబియా గల్ఫ్ కప్ సాధించిన బహ్రెయిన్ ఫుట్ బాల్ హీరోలకు ఘన స్వాగతం లభించింది. బహ్రెయిన్ వీధులు అభిమానుల కేరింతలు, సంబరాలతో వెలిగిపోయింది. అంతకుముందు బహ్రెయిన్ హీరోస్ కు యూత్ అండ్ స్పోర్ట్స్ కోసం సుప్రీం కౌన్సిల్ మొదటి డిప్యూటీ చైర్మన్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడు, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఘన స్వాగతం పలికారు. అనంతరం గల్ఫ్ కప్ ట్రోఫీని అందుకొని వారిని అభినందించారు. ఆ తర్వాత బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫుట్ బాల్ హీరోలు పరేడ్ నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ రోడ్ నుండి షేక్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జి వరకు , క్రౌన్ ప్రిన్స్ స్ట్రీట్ వరకు నిర్దేశిత మార్గంలో సాగుతూ బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వరకు పరేడ్ కొనసాగింది. ఈ సందర్భంగా బహ్రెయిన్ జాతీయ జెండాలోని రెండ్ అండ్ వైట్ రంగులతో యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా బ్యానర్లు ఊపుతూ జట్టు సభ్యులను అభినందించారు. కువైట్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బహ్రెయిన్ 2-1తో ఒమన్‌ను ఓడించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







