అబుదాబిలో కోల్డ్‌ప్లే: ఫ్రీ పార్కింగ్ అండ్ రైడ్ షటిల్ బస్ సర్వీస్‌..!!

- January 06, 2025 , by Maagulf
అబుదాబిలో కోల్డ్‌ప్లే: ఫ్రీ పార్కింగ్ అండ్ రైడ్ షటిల్ బస్ సర్వీస్‌..!!

యూఏఈ: అబుదాబిలో బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే కాన్సర్ట్ కోసం ఫ్యాన్‌జోన్‌లు హాజరైన వారందరికీ మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి. జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంకు సాధారణ ప్రవేశం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఫైనల్ ఎంట్రీ సమయం రాత్రి 8.30 గంటలైనందున ముందుగా అభిమానులు చేరుకోవాలని నిర్వాహకులు కోరారు.

మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్‌లో భాగంగా బ్యాండ్ యూఏఈకి వస్తోంది. ఇది జనవరి 9, 11, 12, 14 తేదీల్లో అబుదాబిలో ప్రదర్శణ ఇస్తున్నారు. వేదిక వద్ద లేదా చుట్టుపక్కల రోడ్లపై పార్కింగ్ అందుబాటులో ఉండదు. స్టేడియంకు చేరుకోవడానికి ఉచిత పార్క్-అండ్-రైడ్ షటిల్ బస్ సర్వీస్‌ను ఉపయోగించమని అభిమానులకు సూచించారు.

దుబాయ్ నుండి ప్రయాణించే అభిమానుల కోసం, ఎక్స్‌పో సిటీ దుబాయ్ నుండి షటిల్ బస్సులు మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరుతాయి. అబుదాబిలో బస్సులు అల్ షహమా, సాస్ అల్ నఖల్, అల్ రహా, నేషన్ టవర్స్ నుండి మధ్యాహ్నం 1.57 గంటలకు ప్రారంభమవుతాయి. ఎక్స్‌పో సిటీ దుబాయ్, అల్ షహామా నుండి బస్ సీట్లు టిక్కెట్‌మాస్టర్ ద్వారా ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడతాయి. అన్ని డిపార్చర్ పాయింట్‌లకు రిటర్న్ షటిల్ కాన్సర్ట్ తర్వాత పని చేస్తుంది. “హాజరయ్యేవారు తమ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందుకు టికెట్‌మాస్టర్ ఉపయోగించాలి. ఈవెంట్‌కు 72 గంటల ముందు స్కాన్ చేయదగిన టిక్కెట్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రతి టిక్కెట్‌కి ప్రత్యేకమైన QR కోడ్ ఉంటుంది. టిక్కెట్‌పై పేర్కొన్న గేట్ ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుంది. ”అని నిర్వాహకులు తెలిపారు.

వేదిక వద్ద కొనుగోలు చేయడానికి టిక్కెట్‌లు అందుబాటులో ఉండవు. టిక్కెట్‌ల అనధికార పునఃవిక్రేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవి నకిలీవి అయి ఉండే అవకాశం ఉందని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈవెంట్‌లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అనుమతి లేదు. 14 ఏళ్లలోపు ఎవరైనా తప్పనిసరిగా 21 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల పెద్దలు తప్పనిసరిగా వెంట ఉండాలి. కాన్సర్ట్ మొత్తం నగదు రహితంగా ఉంటుంది.  కాబట్టి అభిమానులు తమ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను తీసుకురావాలని లేదా మొబైల్ చెల్లింపు ఎంపికలను ఉపయోగించాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com