ఒమన్‌లో NCD సర్వే ప్రారంభం..వాళ్లే టార్గెట్..!!
- January 06, 2025
సలాలా/ రుస్తాక్: దోఫర్ గవర్నరేట్, సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లలో 'నేషనల్ సర్వే ఆఫ్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్(NCD)'ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రారంభించింది. ఒమన్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన అత్యంత ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టులలో ఇది ఒకటి అని దోఫర్ గవర్నరేట్‌లోని ప్రాథమిక సంరక్షణ విభాగం డైరెక్టర్ డా. హమూద్ బిన్ సయీద్ అల్ ఫజారీ తెలిపారు.
సర్వేలో భాగంగా 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు, నివాసితుల నుండి వివరాలను సేకరిస్తున్నారు. షుగర్, గుండె సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌తో సహా సమగ్రమైన డేటాను సేకరిస్తున్నారు. జాతీయ సర్వే కార్యక్రమంలో రెండు దశలు ఉంటాయని వివరించారు. మొదటి దశలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల మ్యాప్‌లను అప్‌డేట్ చేయడానికి ఫీల్డ్ విజిట్‌లు ఉంటాయని, రెండవ దశలో నిర్దేశిత క్వశ్చన్ బుక్ లేట్ ను ఉపయోగించి కొన్ని నమూనాలు, డేటాను సేకరిస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







