కువైట్‌లో స్థిరంగా HMPV ఇన్ ఫెక్షన్ రేట్లు..!!
- January 08, 2025
కువైట్: దేశంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఇన్ఫెక్షన్ రేట్లు స్థిరంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో అంటువ్యాధుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదు కాలేదని, ఈ సీజన్లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) ప్రస్తుతం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణమని పబ్లిక్ హెల్త్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ముంథర్ అల్-హస్సావి పేర్కొన్నారు. అయితే ఇన్ఫ్లుఎంజా కేసులు, ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలలో పెరుగుతున్నాయని తెలిపారు. మంత్రిత్వ శాఖ HMPV తోపాటు ఇన్ఫ్లుఎంజాతో సహా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై స్పెషల్ ఫోకస్ చేసిందన్నారు. టీకాలు తీసుకోవడం, పరిశుభ్రతను నిర్వహించడం, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటి నివారణ చర్యలతో వైరస్ ల నుండి మెరుగైన రక్షణ పొందవచ్చని వివరించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచంలోని సంఘటనలను నిశితంగా పరిశీలిస్తోందని, సంబంధిత వైద్య సంస్థలతో నిరంతరం కమ్యూనికేట్ అవుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







