షార్జాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. వాహనాల విడుదల ఫీజులకు సవరణ..!!

- January 08, 2025 , by Maagulf
షార్జాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. వాహనాల విడుదల ఫీజులకు సవరణ..!!

యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలలో స్వాధీనం చేసుకున్న వాహనాల విడుదలకు రుసుములను సవరిస్తూ షార్జా కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుంది. అయితే తీవ్రమైన నేరాల కోసం వాహనాలను స్వాధీనం చేసుకున్న కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.  నిర్లక్ష్యపు డ్రైవింగ్ సహా ఈ నేరాలు ప్రజలు, ఆస్తుల భద్రతకు న నష్టాలను కలిగిస్తాయని పేర్కొన్నారు. చట్టబద్ధమైన జప్తు వ్యవధి ముగిసిన తర్వాత, ఈ వాహనాలను తిరిగి పొందడం సులభతరం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, సవరించిన ఫీజులను ఇంకా పేర్కొనలేదు.

కౌన్సిల్ తన తాజా సెషన్‌లో ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీల పనితీరును అంచనా వేయడానికి ఉద్దేశించిన అనేక ఎజెండా అంశాలను కూడా చర్చించింది. క్రౌన్ ప్రిన్స్, షార్జా డిప్యూటీ పాలకుడు, షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్  షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి అధ్యక్షతన పరిపాలన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com