సౌదీకి భారీ వర్ష సూచన..సంసిద్ధంగా మక్కా రెడ్ క్రెసెంట్..!!
- January 08, 2025
జెడ్డా: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ జారీ చేసిన భారీ వర్షపు హెచ్చరికలకు ప్రతిస్పందనగా సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) మక్కా రీజియన్ శాఖ తన సంసిద్ధత స్థాయిని పెంచింది. అధికార యంత్రాంగం తన కమాండ్, కంట్రోల్ రూమ్, అంబులెన్స్ స్టేషన్లు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, వాలంటీర్ అంబులెన్స్ యూనిట్ల పూర్తి కార్యాచరణ సంసిద్ధతను వెల్లడించింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, అంబులెన్స్ సేవలకు అంతరాయం లేదని స్పష్టం చేశారు. SRCA ప్రకారం.. మక్కా ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షణకు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్లు, నిపుణులతో సహా అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల బృందాలు దాని 98 కేంద్రాలలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధునాతన అంబులెన్స్‌లు, విపత్తు ప్రతిస్పందన వాహనాలు, క్లిష్ట పరిస్థితుల కోసం ఎయిర్ అంబులెన్స్‌తో సహా 149 వాహనాలతోపాటు మొత్తం 1,420 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
పౌరులు, వాసితులు సంబంధిత అధికారుల సూచనలకు కట్టుబడి ఉండాలని, భారీ వర్షాల సమయంలో రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, జాగ్రత్తగా ఉండాలని కోరింది. అంబులెన్స్ బృందాలు అవసరమైన వారిని చేరుకోవడానికి మార్గాన్ని క్లియర్ చేయడానికి సహకరించాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 997కి కాల్ చేయడం ద్వారా లేదా "Asefne" యాప్ ద్వారా అంబులెన్స్ సేవలను పొందాలని సూచించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







