ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వీ నారాయణన్‌ను నియమిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం

- January 08, 2025 , by Maagulf
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వీ నారాయణన్‌ను నియమిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వీ నారాయణన్‌ను నియమిస్తూ క్యాబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. జనవరి 14న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ పదవీ కాలం జనవరి 13న ముగియనుంది.

ఇస్రో కొత్త ఛైర్మన్‌ డాక్టర్‌ వీ నారాయణన్‌ రెండేళ్లపాటు పదవిలో ఉంటారు. ఆయన ఇప్పటివరకు ఇస్రో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ కు సారథ్యం వహించారు. ఆయన ఇస్రోలో 40 ఏళ్లుగా పనిచేస్తున్నారు. రాకెట్‌తో పాటు స్పేస్‌క్రాఫ్ట్‌ చోదక వ్యవస్థల్లో వీ నారాయణన్‌కు గొప్ప అనుభవం ఉంది.

ఆయన లిక్విడ్‌, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్‌ సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించారు. ఆయన అబ్లేటివ్ నాజిల్ సిస్టమ్స్, కాంపోజిట్ మోటారు కేసెస్, కాంపోజిట్ ఇగ్నైటర్ కేసెస్ ప్రక్రియ ప్రణాళిక, ప్రక్రియ నియంత్రణ రియలైజేషన్‌కు ఎంతో సహకారం అందించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-2తో పాటు 3 వాహక నౌకల అభివృద్ధిలోనూ ఆయనది ముఖ్యపాత్ర.

ఇస్రో చేపట్టిన కీలక ప్రాజెక్టులు ఆదిత్య ఎల్‌1తో పాటు చంద్రయాన్‌ 2, చంద్రయాన్‌ 3లోని చోదక వ్యవస్థల అభివృద్ధిలోనూ ఆయనది కీలక పాత్ర. నారాయణన్‌ తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన వ్యక్తి. ఆయన ఐఐటీ ఖరగ్‌పుర్‌లో క్రయోజెనిక్‌ ఇంజినీరింగ్‌ చదివారు. అనంతరం 2001లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com