ఐదు వాహనాలు "డీ" కొన్న ప్రమాదంలో ఇరువురికి గాయాలు
- June 28, 2016
దుబాయ్: మంగళవారం ఉదయం ఎమిరేట్ రహదారిపై ఐదు వాహనాలు ఒకదానిని ఒకటి గుద్దుకోవడంతో ఇరువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలు కాగా ఒక డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ హమద్ బిన్ సులైమాన్ అల్ రాషిదీయ తెలిపారు. ఈ ప్రమాదం గూర్చి మంగళవారం ఉదయం 9.15 గంటల సమయంలో కార్యకలాపాల గదికి ప్రమాదం గురించి సమాచారం అందుకున్నామని .ఎమిరేట్స్ రహదారిపై దుబాయ్ క్లబ్ వంతెన తర్వాత ఐదు వాహనాలు డీ కొన్నట్లు తెలిసిందని అన్నారు. బ్రిగేడియర్ బిన్ సులైమాన్ ప్రమాద సన్నివేశం వద్దకు వెళ్లి ప్రాథమిక తనిఖీలో కార్లు తీవ్రమైన ధ్వంస స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఐదు వాహనాలలో ఒకటి పికప్ ట్రక్ కాగా , మరొకటి 4 డబ్లూ డి మరియు మూడు సెలూన్ల కార్లు ఉన్నాయి. పికప్ ట్రక్ మలుపు తిరుగుతూ పడిపోయిన ప్రభావంగా 4 డబ్ల్యుడి తీవ్రంగా దెబ్బతింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







