పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్: ఇండియా ర్యాంక్ ఇదే!
- January 10, 2025
ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ 5 స్థానాలు దిగజారింది. 80 నుంచి 85వ స్థానానికి పడిపోయింది. వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 57 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్ శక్తిమంతమైన పాస్‌పోర్ట్ (195 గమ్యస్థానాలకు వీసా ఫ్రీ)గా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. ఈ దేశ పాస్‌పోర్టు కలిగిన వారు వీసా లేకుండానే 195 దేశాలకు వెళ్లొచ్చు. సింగపూర్ తర్వాత జపాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ దేశ పాస్‌పోర్టుతో వీసా లేకుండానే 193 దేశాలను చుట్టేయొచ్చు. ఇక ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా, స్పెయిన్ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టుతో వీసా లేకుండా 192 దేశాలను సందర్శించొచ్చు. ఆ తర్వాత ఆస్ట్రియా (191), డెన్మార్క్ (191) దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటీష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, కుక్ దీవులు, జిబౌటి, డొమినికా, ఇథియోపియా, ఫిజీ, గ్రెనడా, గినియా-బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు జమైకా, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావు, మడగాస్కర్, మలేషియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మారిషస్, మారిటానియా, మైక్రోనేషియా, నేపాల్, మయన్మార్, ఖతార్, రువాండా, శ్రీలంక, మోంట్సెరాట్, మొజాంబిక్, నియు, పలావు దీవులు, సమోవా, సెనెగల్, సీషెల్స్, సియెర్రా లియోన్, సోమాలియా, సెయింట్ కిట్స్, నెవిస్, లూసియా , సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్-లెస్టే, ట్రినిడాడ్, వీసా లేకుండా టొబాగో, తువాలు, వనాటు, జింబాబ్వే దేశాల్లో ప్రవేశించవచ్చు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







