భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పిన TTD పాలక మండలి
- January 10, 2025
తిరుమల: తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. తమ తప్పు లేకపోయినా సరే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. అయితే టీటీడీ బోర్డు సమావేశం జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు తరఫున ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో తాను క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
పాలకమండలి సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీర్ నాయుడు మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగి రారు కదా?.. ఎవరో ఏదో మాట్లాడారని దానిపై స్పందించాల్సిన పనిలేదు’. అని అన్నారు. అయితే టీటీడీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్నందున దానిపై మరోసారి మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు తాము పాటిస్తున్నామని, తమ తప్పు లేకపోయినా సరే.. క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. దీంతో పాటుగా బీఆర్ నాయుడు చేసినవ్యాఖ్యలపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తాను చేసిన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
‘నా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదు.. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా.. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలి’ ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







