హైదరాబాద్: 13 నుంచి అంత‌ర్జాతీయ కైట్ ఫెస్టివ‌ల్

- January 11, 2025 , by Maagulf
హైదరాబాద్: 13 నుంచి అంత‌ర్జాతీయ కైట్ ఫెస్టివ‌ల్

హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో ఈనెల 13 నుంచి మూడురోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్ హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌నున్నారు.రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఈ ప‌తంగుల ఫెస్టివ‌ల్ కు అంతర్జాతీయ, అంతర్రాష్టాల్లో పతంగులు ఎగురవేసే కైట్‌ ఫ్లయర్స్‌ను ఆహ్వానాలు ఇప్ప‌టికే పంపారు.

ఇండోనేషియా, స్విట్జర్లాండ్‌, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్‌, థాయిలాండ్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్‌, సౌత్‌ ఆఫ్రికా, నెదర్లాండ్స్‌, తదితర దేశాలకు చెందిన 50మంది కైట్‌ ఫ్లయర్స్‌ హాజరవుతున్నారు. వారితో పాటు గుజరాత్‌, పంజాబ్‌, తమిళనాడు, కేరళ , హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ర్టాలకుకు చెందిన 60 మంది క్రీడాకారులు తరలిరానున్నారు.

ఉచితంగా ప్ర‌వేశం
ఈ కైట్స్ ఫెస్టివ‌ల్ లోకి వీక్ష‌కుల‌కు ఉచిత ప్ర‌వేశం క‌ల్పించారు.ఈ ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.వాటిని తిలకించే సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లను చేస్తున్నామని, పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉండనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com