నన్ను క్షమించండి: దిల్ రాజు

- January 11, 2025 , by Maagulf
నన్ను క్షమించండి: దిల్ రాజు

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిజామాబాద్ పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఆంధ్ర వాళ్లకు సినిమాలకు కిక్కు ఇస్తాయి.. తెలంగాణ వాళ్లకు కల్లు, మటన్ వైబ్ను ఇస్తాయని మాట్లాడారు.

అయితే దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం చేలరేగింది. తెలంగాణ ప్రజలకు తిండిబోతులుగా, తాగుబోతులుగా అర్థం వచ్చేలా మాట్లాడారని కొన్ని సంఘాలు దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తనపై వస్తోన్న విమర్శలపై దిల్ రాజు తాజాగా స్పందించారు.. నా మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్మీడియాలో పెట్టారని తెలిసింది. తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉందని చెప్పటం నా ఉద్దేశమని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

కానీ నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను మన కల్చర్ ను అభిమానించే వ్యక్తిని. నిజంగా నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించాలని కోరుతున్నానని చెప్పి ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. సినిమా రంగంలో కిందిస్థాయి నుంచి ఎఫ్ఎసీ చైర్మన్గా ఎదిగాను. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు ప్రభుత్వానికీ మధ్యలో ఉంటూ పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా. తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి చెందడంతో పాటు, యువతకు ఉపయోగపడేలా పనిచేస్తా. తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణను ఎలా అవమానిస్తానని, హేళన చేస్తారని అనుకున్నారో నాకు తెలియదని ఆయన ఈ వీడియో ద్వారా తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com