టీ20 పోరుకు టీమిండియా రెడీ!

- January 11, 2025 , by Maagulf
టీ20 పోరుకు టీమిండియా రెడీ!

భారత్-ఇంగ్లాండ్ మ‌ధ్య ఈ నెల 22 నుంచి మొదలయ్యే ఐదు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగ‌నుండ‌గా.. ఈ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది.

ఇక‌, ఇంగ్లండ్‌తో టీ20 పోరుకు సిద్ధమైన భారత జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయ‌ర్లు తిలక్ వర్మ, నితీష్ రెడ్డిలకు కూడా చోటు దక్కించుకున్నారు. అలాగే, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత చీలమండ గాయం కారణంగా జట్టుకు దూరమైన భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్).

22న తొలి మ్యాచ్..

జనవరి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో తొలి టీ20.
జనవరి 25న చెన్నైలో రెండో టీ20.
జనవరి 28న రాజకోట్‌లో మూడో టీ20.
జనవరి 31న పుణెలో నాలుగో టీ20.
ఫిబ్రవరి 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదో టీ20 జరగనుంది.

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com