RCA అధికారులకు మెడల్స్ అందజేసిన సుల్తాన్..!!

- January 12, 2025 , by Maagulf
RCA అధికారులకు మెడల్స్ అందజేసిన  సుల్తాన్..!!

మస్కట్: సుప్రీమ్ కమాండర్ అయిన హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్.. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ హిస్ మెజెస్టి యాక్సేషన్ దినోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, రాయల్ కోర్ట్ అఫైర్స్ (RCA) నాన్-కమిషన్డ్ ఆఫీసర్లకు సేవా పతకాలు, రాయల్ ప్రశంసలను ప్రదానం చేశారు.ఆర్‌సిఎ సెక్రటరీ జనరల్ నాస్ర్ హమూద్ అల్ కియెన్డీ అధికారులు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లకు పతకాలను పిన్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక వైద్య వ్యవహారాల విభాగం అధిపతి మేజర్ జనరల్ డాక్టర్ సైఫ్ జహీర్ అల్ సల్మీ, మానవ ఆర్థిక వనరులు , సహాయ వ్యవహారాల అధిపతి షేక్ సెయిద్ హిలాల్ అల్ ఖలీలీ, అలాగే RCAలోని సైనిక విభాగాలకు చెందిన కొందరు కమాండర్లు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com