రియాద్ సీజన్.. 3 నెలల్లో 16 మిలియన్ల మంది సందర్శన..!!
- January 12, 2025
రియాద్: రియాద్ సీజన్ 2024కి సందర్శకుల సంఖ్య ఇప్పటివరకు 16 మిలియన్లకు దాటిందని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (జిఇఎ) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ తుర్కీ అల్-షేక్ వెల్లడించారు. ఈ మేరకు అల్-షేక్ తన X ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపారు. రియాద్ సీజన్ ఐదవ ఎడిషన్ అక్టోబర్ 12, 2024న ప్రారంభమైంది.
ఈ గ్లోబల్ ఈవెంట్‌కు సౌదీతోపాటు విదేశాల నుండి సందర్శకులు భారీగా తరలివచ్చారనడానికి ఈ సంఖ్య గొప్ప రుజువు అని GEA చీఫ్ అన్నారు. 16 మిలియన్లకు చేరుకున్న సందర్శకుల సంఖ్య రియాద్ సీజన్ అసాధారణ విజయాన్ని అందించిందని తెలిపారు. ఇది వినూత్న వినోదంతో పాటు బాక్సింగ్, రెజ్లింగ్ మ్యాచ్‌లు, అంతర్జాతీయ కాన్సర్టులు, విలక్షణమైన రెస్టారెంట్లు, సుందరమైన తోటలు వంటి అనేక రకాల ఈవెంట్లను కలిగి ఉన్న సమగ్ర అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. అన్ని వయసుల వారి అభిరుచికి అనుగుణంగా కళా ప్రదర్శనలు, థియేట్రికల్ ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలతో సహా వేలాది విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని,ఈ సీజన్లో ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు తరలివస్తున్నారని పేర్కొన్నారు. రియాద్ సీజన్ ఈవెంట్లు ఐదు ప్రధాన జోన్లలో బౌలేవార్డ్ వరల్డ్, కింగ్డమ్ అరేనా, బౌలేవార్డ్ సిటీ, ది వెన్యూ, అల్ సువైదీ పార్క్ లలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి జోన్ సందర్శకులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







