ప్రవాసులకు షాకిచ్చిన బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- January 12, 2025
మనామా: బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖలో ఉద్యోగ జాతీయీకరణ వేగంగా జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం.. విదేశీ ఉద్యోగుల స్థానంలో బహ్రెయిన్ పౌరులను నియమించడంలో విద్యా మంత్రిత్వ శాఖ గణనీయమైన పురోగతిని సాధించింది. 2020- 2023 మధ్య విద్యా మంత్రిత్వ శాఖ 2672 మంది బహ్రెయిన్ పౌరులను నియమించింది. అదే సమయంలో 986 మంది విదేశీ ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం, 3074 మంది విదేశీయులు మంత్రిత్వ శాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పారిశ్రామిక విద్య, ఫ్రెంచ్ భాషా బోధన, సంగీత విద్యతో సహా పలు ప్రత్యేక రంగాలలో విదేశీ ఉపాధ్యాయులు కీలక పాత్రలు పోషిస్తున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధిక అర్హత కలిగిన బహ్రెయిన్ గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో సైన్స్, మ్యాథమెటిక్స్, అరబిక్, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లీషు కోసం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు, రాబోయే సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







