1 బిలియన్ మందికి అగ్నిమాపక భద్రతలో శిక్షణ.. Dh1 మిలియన్ వరకు బహుమతి..!!

- January 15, 2025 , by Maagulf
1 బిలియన్ మందికి అగ్నిమాపక భద్రతలో శిక్షణ.. Dh1 మిలియన్ వరకు బహుమతి..!!

యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక బిలియన్ వ్యక్తులకు అగ్ని భద్రత, సంసిద్ధతలో శిక్షణ ఇవ్వడానికి యూఏఈ ప్రతిష్టాత్మకమైన కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వర్చువల్ కోర్సులను నిర్వహించడానికి ప్రపంచవ్యాప్తంగా 34 దేశాలు, 16 ప్రధాన అగ్నిమాపక సంస్థలతో కలిసి పనిచేయడం '1 బిలియన్ రెడినెస్' పేరిట శిక్షణ ఇవ్వనున్నారు. దుబాయ్‌కి చెందిన సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మాట్లాడుతూ..అగ్ని రక్షణ, భద్రతను ముందుకు తీసుకెళ్లడానికి ఈ పథకం అతిపెద్ద ప్రపంచ ప్రయత్నాలలో ఒకటిగా ఉందన్నారు. 2025 నుండి 2027 వరకు అమలులో ఉండే ఈ కార్యక్రమం అగ్ని ప్రమాదనివారణ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మందికి శిక్షణ, అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 

దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ జనరల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ రషీద్ థానీ అల్ మత్రూషి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా శిక్షణ అందిస్తామని వివరించారు. శిక్షణలో పాల్గొనేవారు Dh1 మిలియన్ వరకు బహుమతితో పాటునిస్సాన్ పెట్రోల్‌తో సహా బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినవారు గ్లోబల్ వైల్డ్‌ఫైర్ మానిటరింగ్ సెంటర్, దుబాయ్ సివిల్ డిఫెన్స్ రెడీనెస్ ప్రోగ్రాం జారీ చేసిన సర్టిఫైడ్ ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్‌ను అందజేస్తామని తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com