BAPS హిందూ మందిర్ ను సందర్శించిన 20దేశాల డిఫిన్స్ అధికారులు..!!
- January 15, 2025
అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ను 20 కంటే ఎక్కువ రాయబార కార్యాలయాలకు చెందిన డిఫిన్స్ అధికారులు, వారి కుటుంబాలు సందర్శించారు. BAPS స్వామినారాయణ్ సంస్థ కృషితో నిర్మించిన మందిర్ ప్రారంభమైన ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ప్రపంచం నలుమూలల నుండి రెండు మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. బెల్జియం, కెనడా, కొమొరోస్ ద్వీపం, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇండియా, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, కొరియా, మొజాంబిక్, టాంజానియా, సెర్జియా, స్విట్జర్లాండ్ దేశాల రక్షణ శాఖ అధికారులు ఉన్నారు. ప్రతినిధులకు BAPS బోర్డు సభ్యులు, వాలంటీర్లు సంప్రదాయ దండలు మరియు గులాబీలతో సాదరంగా స్వాగతం పలికారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ అద్భుతమైన ప్రయాణాన్ని తెలిపే 'ది 'ఫెయిరీ టేల్' ప్రదర్శనను చూసి ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు. మందిర్ ముఖద్వారంపై చెక్కబడిన ప్రాచీన నాగరికత విలువను తెలియజేసే కళాత్మకతను చూసి ప్రశాలు కురిపించారు. అనంతరం ప్రతినిధులు తమ ఆలోచనలను పంచుకోవడంతో వారి పర్యటన ముగిసింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







