ఎడిసన్‌లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- May 31, 2026
న్యూ జెర్సీ: "భాషే రమ్యం... సేవే గమ్యం" అనే నినాదంతో అమెరికాలోని ప్రవాస తెలుగు వారికి నిరంతరం అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఆధ్యాత్మిక, సామాజిక సేవలలో ముందుండే 'సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ సంయుక్తంగా ఎడిసన్ నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి. ఎడిసన్ లోని ఓక్‌ట్రీ రోడ్‌లో గల సాయి దత్త పీఠం ప్రాంగణంలో ఈ శిబిరం కొనసాగింది. స్థానిక ప్రవాస తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేని వారు, వృద్ధులు,భారతదేశం నుండి తాత్కాలికంగా అమెరికా పర్యటనకు వచ్చిన తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వైద్య శిబిరంలో అమెరికాలోని ప్రముఖ తెలుగు వైద్య నిపుణులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అమూల్యమైన సలహాలను అందించారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డా. జనార్ధన్ బొల్లు జీర్ణక్రియ, కాలేయం, పొట్టకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా రోగులను పరీక్షించారు. ఫ్యామిలీ మెడిసిన్ నిపుణులు డా.స్మిత గుబ్బి సాధారణ ఆరోగ్య సమస్యలపై రోగులకు తగిన దిశానిర్దేశం చేశారు. అలాగే నర్స్ ప్రాక్టీషనర్ బీనా లోపెజ్ రోగుల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్, కౌన్సిలింగ్‌లో కీలక సేవలందించారు. ఈ శిబిరానికి ట్రెంటన్‌కు చెందిన 'హామిల్టన్ ఫార్మసీ' ప్రత్యేక స్పాన్సర్‌గా వ్యవహరించి తగిన మద్దతును అందించింది.
నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ శిబిరంలో నాట్స్ నాయకులు బిందు యలమంచిలి, కిరణ్ మందాడి నాట్స్ ఈసి సభ్యుడు, సాయి దత్త పీఠం డైరెక్టర్స్ దాము గేదెల, సుభద్ర పాటిబండ్ల, మురళీ కృష్ణ మేడిచెర్ల ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ (మీడియా) తదితరులు కీలక పాత్రపోషించి వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు. శ్రీనివాస్ మెంట బోర్డు ఆఫ్ డైరెక్టర్, కిరణ్ మందాడి నాట్స్ ఈసి సభ్యుడు, చక్రధర్ వోలేటి, శ్రీకాంత్ పొనకాల, ప్రసాద్ టేకి, శంకర్ జెర్రిపోతుల, జతిన్ కొల్లా, ధర్మ ముమ్ముడి తదితరులు, తెలుగు విద్యార్దులు ఈ వైద్య శిబిరంలో ఎంతో ఉత్సాహంగా తమ సేవలను అందించారు. సామాజిక బాధ్యతలో బాగంగా విద్యార్ధులు చేసిన సేవలను నాట్స్ గుర్తించి వారికి నాట్స్ సేవా సర్టిఫికెట్లను అందించింది. నేరుగా నిపుణులైన డాక్టర్లను కలిసి, ఉచితంగా ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకునే అవకాశం. కల్పించినందుకు స్థానిక తెలుగు ప్రజలు 'నాట్స్' , 'సాయి దత్త పీఠం' సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎడిసన్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతిఒక్కరిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అభినందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







