స్లాటర్ హౌస్‌లను వినియోగించాలి: మునిసిపాలిటీ
- June 29, 2016
మునిసిపల్ అథాఇటీస్, రెసిడెంట్స్‌కి స్లాటర్ హౌస్‌ల వినియోగంపై అప్పీల్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో జంతువుల్ని వధించడం మానాలనీ, లేదంటే ఆ చర్యల కారణంగా అబుదాబీ సిటీ ఇమేజ్‌కి చెడ్డపేరు వస్తుందనీ, వ్యర్థాల కారణంగా పరిసరాలు కలుషితమవుతాయని అధికారులు హెచ్చరించారు. హెచ్చరికల్ని లెక్కచేయనివారికి 500 దిర్హామ్‌ల జరీమానా విధించబడుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. అబుదాబీ స్లాటర్ హౌస్‌లలో ఈ రమదాన్ సందర్భంగా 75,000 జంతువులను ప్రాసెస్ చేస్తారు. గతంతో పోల్చితే ప్రస్తుతం 15.5 శాతం అధికంగా ఈ సంఖ్య ఉండవచ్చునని అంచనా. అబుదాబీ పబ్లిక్ స్లాటర్ హౌస్, బనియాస్ స్లాటర్ హౌస్, అల్ వత్బా స్లాటర్హౌస్తోపాటు, అదనపు ఏర్పాట్లు కూడా చేస్తున్నామనీ, రెసిడెంట్స్ వీటిని వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆయా జంతువుల్ని బట్టి 15 దిర్హామ్‌ల నుంచి 60 దిర్హామ్‌లదాకా స్లాటర్ హౌస్‌లలో ఛార్జ్ చేస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







