వైకుంఠ ద్వారా దర్శన ఎస్ఎస్డీ టోకెన్ల పై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష
- January 16, 2025
తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డీ టోకెన్లపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఉన్నతాధికారులతో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జనవరి 19తో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ మణికంఠ చందోలు, ఇతర అధికారులు ఎస్ఎస్డీ టోకెన్లపై సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశంలో కొన్ని ముఖ్యాంశాలు:
- తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉంది.
- జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబడవు. వారు సర్వదర్శనం క్యూ లైన్లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
- జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయబడవు.
- అదేవిధంగా, జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది.ఈ కారణంగా జనవరి 19న VIP బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
- పైన పేర్కొన్న సూచనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకుని టిటిడికి సహకరించాలని కోరడమైనది.
ఈ సమావేశంలో GM(IT) శేషా రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీవో సదాలక్ష్మి తదితర అధికారులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







