UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!

- January 17, 2025 , by Maagulf
UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!

ముంబై: దుబాయ్ డ్యూటీ ఫ్రీలో UPI పేమెంట్స్ చేయవచ్చు. యూఏఈలో UPI చెల్లింపుల కోసం NPCI అంతర్జాతీయ విభాగం యూపీఐ చెల్లింపుల కోసం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఒపశ్చిమాసియాకు మాగ్నాటి (Magnati)తో చెల్లింపుల కోసం  భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుంది. ఒప్పంద పత్రాలపై ఇరు  సంస్థలకు చెందిన అధికారులు సంతకాలు చేశారు. మాగ్నాటి POS టెర్మినల్స్‌లో UPI-ఆధారిత QR చెల్లింపులను ప్రారంభించడం ఈ సహకార ఒప్పందం లక్ష్యం. యూఏఈలో భారతీయ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేని, మెరుగైన చెల్లింపు ఎంపికలను ఇది అందిస్తోందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com